Monday, May 6, 2024

300 యూనిట్ల ఉచిత కరెంట్ ప్రకటించిన కేజ్రీవాల్

ఉత్తరాఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు తాయిలాలు ప్రకటిస్తున్నాయి. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కేజ్రీవాల్ వరాల జల్లు కురిపించారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రకటించారు. ఉచిత కరెంట్‌తో పాటు కరెంట్ బిల్లుల బకాయిలు, తప్పుడు బిల్లులను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ తరహాలో ఉత్తరాఖండ్‌లోనూ కరెంట్ కోతలు లేకుండా చూస్తామన్నారు. రైతులకు ఉచిత కరెంట్ ను అందిస్తామన్నారు.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సీఎం అంటూ లేడని, తమ ముఖ్యమంత్రి చెడ్డవాడంటూ అధికార పార్టీయే చెబుతోందని కేజ్రీవాల్ విమర్శించారు. సీఎం పదవి కోసం బీజేపీలో అంతర్గత పోట్లాటలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఇటు ప్రతిపక్షానికీ సరైన నేతలు లేరన్నారు. అలాంటప్పుడు ఉత్తరాఖండ్ అభివృద్ధిని పట్టించుకునేదెవరని ప్రశ్నించారు. కాగా ఉత్తరాఖండ్‌లో 20 నుంచి 22 సీట్లలో ఆప్ పోటీ చేయాలని భావిస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: జనాభాను తగ్గించేందుకు కొత్త విధానం

Advertisement

తాజా వార్తలు

Advertisement