Saturday, May 4, 2024

ధ‌మ్ కీ రిలీజ్ ఎప్పుడంటే..

ధ‌మ్ కీ మూవీ న్యూ రిలీజ్ డేట్ ని ఎనౌన్స్ చేశారు మేక‌ర్స్.కాగా విశ్వక్‌ సేన్‌ స్వీయ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. కామెడీ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ మూవీకి ప్రసన్నకుమార్ బెజవాడ కథనందిస్తున్నారు.ఈ మూవీలో రావు రమేశ్, పృథ్విరాజ్‌, హైపర్‌ ఆది కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియోన్‌ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. వన్మయి క్రియేషన్స్‌, విశ్వక్‌ సేన్ సినిమాస్‌ బ్యానర్లు ధమ్‌ కీ చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ మూవీ కొత్త డేట్‌ ఏంటో చెప్పేశారు.కామెడీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్‌. ఈ విషయాన్ని తెలియజేస్తూ విశ్వక్‌సేన్‌ ఓ వైపు ఎంజాయ్ మూడ్‌లో కనిపిస్తూ.. మరోవైపు ధమ్‌ కీ ఇస్తున్నట్టుగా ఉన్న డిఫరెంట్‌ లుక్స్ తో కొత్త పోస్టర్‌ విడుదల చేశారు. ఈ స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.పాన్ ఇండియా స్టోరీతో వస్తోన్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. పాగల్ తర్వాత విశ్వక్‌ సేన్‌, నివేదా కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది.

Advertisement

తాజా వార్తలు

Advertisement