Tuesday, May 7, 2024

Dasara Celebrations – రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన కంగనా రనౌత్..

బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ నిన్న దసరా వేడుకల సందర్భంగా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రావణ దహనం చేసిన మొదటి మహిళగా ఈ ఘనత సాధించింది. కంగనాతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ రావణ, కుంభకరణ్, మేఘనాథుల దిష్టిబొమ్మలను కంగనా దహనం చేశారు.

అయితే, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఢిల్లీలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఏడాది రావణుడి దిష్టిబొమ్మను దహనం చేసిన తొలి మహిళగా కంగనా రనౌత్ చరిత్ర సృష్టించింది. రాంలీలా మైదానంలో రావణ దహనంతో పాటు శ్రీరాముడి మహిమను కంగనా కొనియాడింది. ‘శ్రీరాముడు ఉంటే మనం ఉన్నాం.. ఆయనలాంటి వారు ఈ లోకంలో ఎవరూ లేరు.. మళ్లీ రారు అని చెప్పింది. ఆ తర్వాత జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ రావణుడిని దహనం చేశారు. బాణసంచా కాల్చడం నిషేధించాలన్న ప్రభుత్వ ఆదేశంతో.. రామ్ లీలా మైదానం అంతటా శబ్ధం వినిపించే విధంగా ఎనిమిది ట్రాక్‌ల డిజిటల్‌ డాల్బీ సౌండ్‌ సిస్టమ్‌ ద్వారా బాణాసంచా శబ్దాన్ని రికార్డు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement