Tuesday, May 14, 2024

Tamilnadu: ద‌ళ‌ప‌తి విజ‌య్ కొత్త పార్టీ …అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ…

త‌మిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌న రాజ‌కీయ పార్టీ ఏర్పాటు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు.. చెన్నైలో నేడు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ‘తమిళ వెట్రి కళ‌గం’ పేరుతో ప్రాంతీయ పార్టీని స్థాపించిన‌ట్లు చెప్పారు.

త‌మ పార్టీ ల‌క్ష్యం వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేయ‌డ‌మేన‌ని చెప్పారు.. 2024 లోక్ స‌భ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేద‌ని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేద‌ని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే జనరల్, ఎగ్జిక్యూటివ్ క‌మిటీల కోసం అంద‌రితో క‌ల‌సి స‌మావేశం ఏర్పాటు చేస్తునట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement