Saturday, May 4, 2024

CSK vs KKR | టాస్ గెలిచిన చెన్నై..

ఐపీఎల్ 2024లో భాగంగా నేడు కోల్‌కతా నైట్ రైడర్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై జట్టు బైలింగ్ ఎంచుకుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోల్‌కతా ఫస్ట్‌ బ్యాటింగ్‌తో బరిలోకి దిగనుంది. కాగా, మరి కొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

జ‌ట్ల వివ‌రాలు

కోల్‌కతా నైట్ రైడర్స్ :

ఫిలిప్ సాల్ట్ (WK), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (c), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, ఆండ్రీ రస్సెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా.

చెన్నై సూపర్ కింగ్స్ :

రుతురాజ్ గైక్వాడ్ (c), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (WK), శార్దూల్ ఠాకూర్, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.

- Advertisement -

ఈ సీజన్‌లో చెన్నైకి ఇది ఐదో మ్యాచ్ కాగా.. ఇప్పటివరకు ఆడిన జట్టు 4 మ్యాచ్‌లో రెండు గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో నాల్గవ స్థానంలో ఉంది. మరోవైపు కోల్‌కతాకు ఇది నాలుగో మ్యాచ్ కాగా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ గెలిచి పాయింట్స్‌ టేబుల్‌లో రెండవ స్థానంలో నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement