Tuesday, May 7, 2024

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా?: రామకృష్ణ

కరోనా ఆపత్కాలంలో రోజుకి 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేయడం తగునా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేసేందుకు చర్యలు వేగవంతం చేయడం దుర్మార్గమన్నారు. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించేందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కీలకంగా వ్యవహరిస్తోందని తెలిపారు. మరో 50 టన్నుల సామర్థ్యం పెంచి, రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి కోసం ప్రయత్నిస్తోందన్నారు. ఆంధ్రుల హక్కుగా భాసిల్లిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం అమ్మడాన్ని విరమించుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

కాగా, కాగా, ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. కరోనా రోగులకు ఎంతో అవసరమైన, వారి ప్రాణాలను కాపాడే లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ను తయారు చేస్తోంది. కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement