Tuesday, May 14, 2024

చేపలు, పీతలకూ కొవిడ్‌ పరీక్షలు

కరోనా కేసులు మళ్లి భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. కొన్ని దేశాల్లో కేసులు క్రమంగా పెరుగు తున్నాయి. చైనాలోని జియామెన్‌ ప్రాంతంలోనూ వైరస్‌ వ్యాప్తి ప్రబలంగా ఉంది. ఇక్కడ 50 లక్షల మందికి పైగా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. ఇక్కడ విశేషమేమంటే, ఈ కొవిడ్‌ టెస్టులు కేవలం మనుషులతోపాటు సీ ఫుడ్‌కూ విస్తరించారు. ఇప్పుడు అధికారులు చేపలు, పీతలకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయడంలో తలమునకలయ్యారు.

ఇందుకు సంబంధించి సౌత్‌చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేసిన వీడియో వైరల్‌ అయింది. ఆరోగ్య కార్యకర్తలు చేపలు, పీతలకు కొవిడ్‌ టెస్టుల చేస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపించాయి. ఈ వీడియో చైనా మీడియా అంతటా చర్చకు దారితీసింది. ఆన్‌లైన్‌లో షేర్‌ చేయబడిన తర్వాత ఈ వీడియో దాదాపు 2 లక్షల వీక్షణలను సంపాదించింది. కొందరు నెటిజన్లు ఈ చర్యను అభినందిస్తుండగా, మరికొందరు ఇదెక్కడి చోద్యం అంటూ ఆశ్చర్యపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement