Monday, April 29, 2024

వైరల్ వీడియోః నీటిలో పెళ్లి.. అతిథులు ఎవరంటే..

పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయంటారు. అయితే, ఈ మధ్య కొందరు తమ పెళ్లిని వెరైటీగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో విమానంలోనో, ప‌డ‌వ‌ల్లో పెళ్లి చేస్తున్న సందర్భంగాలు వెలుగు చూశాయి. తాజాగా ఇప్పుడు ఓ జంట నీటిలోపల పెళ్లి చేసుకుంది. యూకేలో చోటు చేసుకున్న ఈ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కూబా డైవింగ్ అంటే ఈ జంట‌కు చాలా ఇష్టమట. దీంతో ఇంగ్లండ‌లోని బర్మింగ్‌హామ్ లోని మార్స్టన్ గ్రీన్ లో ఉండే బేర్ గ్రిల్స్ అడ్వెంచర్ సెంటర్ లోని వారు ఈ విధంగా పెళ్లి చేసుకున్నారు. ఐదు సంవత్సరాలుగా కలిసి ఉన్న ఈ జంట.. ఎనిమిది మంది అతిథులు సమక్షంలో ఒక్క‌ట‌య్యారు. నీటిలోరంగు రంగుల చేపలు సందడి చేశాయి.  

https://twitter.com/TheSun/status/1436185162685902877
Advertisement

తాజా వార్తలు

Advertisement