Sunday, April 28, 2024

ప్రతి ఆదివారం పూర్తిగా లాక్ డౌన్..

కేర‌ళ లో కరోనా విజృంభిస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో నమోదవుతున్న కేసుల కంటే ఒక కేరళలోనే అధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయి. కేరళలో రోజుకు 20 వేలకు పైగా కేసులు నమోదవతున్నాయి. రోజువారీ కేసులు భారీ స్తాయిలో పెరుగుతుండ‌టంతో ప్ర‌భుత్వం క‌ట్ట‌డికి క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి సిద్ధం అవుతున్న‌ది.  ఇక‌పై ప్ర‌తి ఆదివారం రోజున రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమ‌లుచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. మూడోవేవ్ ప్ర‌మాదం పొంచి ఉండ‌టంతో కేర‌ళ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల విష‌యంలో స‌రిహ‌ద్దు రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.  ఆర్‌టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్ట‌నిస్తామ‌ని త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క స‌ర్కార్లు నిర్ణ‌యాలు తీసుకున్నాయి. ఆ రాష్ట్రంలో వేగంగా వ్యాక్సినేష‌న్‌ను అమ‌లు చేస్తున్న‌ప్ప‌టికీ, కేసులు కంట్రోల్ కావ‌డంలేదు.  పైగా  దేశంలో రోజువారీ కేసుల్లో స‌గం కేసులు కేర‌ళ రాష్ట్రంలోనే న‌మోద‌వుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది.  .

ఇది కూడా చదవండి: అన్ని సినిమాలు కలిపినా రూ.10వేలు కలెక్షన్ రాలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement