Saturday, March 23, 2024

బీస్ట్ బిజినెస్ మాములుగా లేదు!!

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం బీస్ట్. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది. అయితే విజయ్ దళపతి సినిమా బిజినెస్ అంటే ఏ స్థాయిలో ఉంటుందో కొత్తగా చెప్పనవసరం లేదు. కాగా ఈ నేపథ్యంలోనే బీస్ట్ సినిమాకు అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చిందని తెలుస్తోంది.

హిందీ డబ్బింగ్ రైట్స్ కి గాను 45 కోట్లకు పైగా ఆఫర్ వచ్చిందని సమాచారం. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement