Wednesday, May 1, 2024

అన్ని సినిమాలు కలిపినా రూ.10వేలు కలెక్షన్ రాలేదు

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్.. కొత్త సినిమా వచ్చిందంటే ఇక్కడ ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. తెలుగు రాష్ట్రాలలోనే సినిమా థియేటర్లకు ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ పక్కపక్కనే సుమారు 10 వరకు థియేటర్లు ఉంటాయి. అందులో ప్రస్తుతం 2, 3 మూతపడినా సినిమా సందడికి లోటు ఉండదు. కానీ కరోనా వల్ల థియేటర్లు మూతపడి ఇటీవలే తెరుచుకున్నాయి. ఈ ఏరియాలో అన్ని సినిమాలకు కలిపి కోట్లలో ఉండే కలెక్షన్లు.. ప్రస్తుతం రూ.10వేలు కూడా రావడం లేదు.

ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నాలుగు థియేటర్లు మాత్రమే నడుస్తున్నాయి. సుదర్శన్, దేవి, సంధ్య 35, సప్తగిరి థియేటర్లలో మాత్రమే సినిమాలను ప్రదర్శిస్తున్నాయి. ఇంకా సంధ్య 70, శాంతి, తారకరామ, శ్రీమయూరి వంటి థియేటర్లు తెరుచుకోవాల్సి ఉంది. అయితే నడుస్తున్న నాలుగు థియేటర్లలో బుధవారం ఉదయం కలెక్షన్లు చూస్తే ఎవరికైనా దిమ్మతిరగాల్సిందే. సుదర్శన్‌లో 2వేలు, దేవిలో 3వేలు, సంధ్యలో 3వేలు, సప్తగిరిలో రూ.వెయ్యి మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. సత్యదేవ్ ‘తిమ్మరుసు’కు మంచి టాక్ వచ్చినా కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. తేజ సజ్జ ‘ఇష్క్’ సంగతి సరేసరి. లవ్ స్టోరీ, టక్ జగదీష్, ఆచార్య వంటి సినిమాలు రెడీగా ఉన్నా రిలీజ్‌కు నోచుకోవడంలేదు. మరోవైపు కరోనా భయం కారణంగా సినిమా ప్రేక్షకులు థియేటర్ల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement