Friday, April 26, 2024

వెంక‌టేష్ మ‌హా కెజిఎఫ్ పై సెటైర్లు.. మండిప‌డుతున్న క‌న్న‌డ ఫ్యాన్స్

కన్నడ స్టార్ యష్ నటించిన కేజీఎఫ్ చాప్ట‌ర్-1, 2 సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజ‌యాన్ని సాధించాయి. కన్నడలోనే కాకుండా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ మూవీ రికార్డులను బద్దలు కొట్టి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఓ టాలీవుడ్ దర్శకుడికి ఈ సినిమా అస్సలు నచ్చలేదట‌. C/o కంచెరపాలెం సినిమాతో ఫేమ్ అయిన వెంకటేష్ మహా ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆయ‌న‌తో పాటు నందిని రెడ్డి, ఇంద్రగంటి మోహన కృష్ణ, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ కూడా ఉన్నారు. అయితే, ఇంటర్వ్యూలో దర్శకుడు కేజీఎఫ్ సినిమా పేరు చెప్పకుండా కథ గురించే చెబుతూ సెటైర్లు వేశారు.

‘తల్లికి ఒక పెద్ద కోరిక .. దానిని సాధించేందుకు ఈ హీరో వెళ్లి బంగారం తవ్వి.. ఆ బంగారాన్ని తీసుకెళ్లి ఎక్కడికో పారేస్తాడు. అతనంత పిచ్చి ఎవరైనా ఉంటుందా? ఆ మహాతల్లి నిజంగా ఉంటే ఆమేని కలవాలనిపిస్తుంది. ఇలాంటి కథను సినిమాగా తీస్తే మ‌నం చప్పట్లు కొట్టి హిట్ చేస్తున్నాం’ అని వ్యంగ్యంగా అన్నారు. కాగా, ఇప్పుడు ఈ విష‌యమే సోష‌ల్ మీడియాలో వివాదాస్ప‌దంగా మారింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు యశ్ అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో హిట్ అయిన సినిమాపై ఇంత దారుణంగా మాట్లాడుతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా మాటలకు గట్టిగా నవ్విన దర్శకురాలు నందిని రెడ్డి ఈ వివాదంపై సోషల్ మీడియాలో స్పందించి క్షమాపణలు చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement