Friday, May 3, 2024

బీసీ బిల్లు సాధనకు నిరంతర పోరాటం.. ఢిల్లీలో బీసీ సెంట్రల్ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు మద్ధతివ్వని పార్టీలను ఢిల్లీలో తిరగనివ్వమని బీసీ సంక్షేమ సంఘం సెంట్రల్ కమిటీ హెచ్చరించింది. శనివారం ఢిల్లీలో సమావేశమైన సంఘం నేతలు, బిల్లు కోసం ఢిల్లీ కేంద్రంగా పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామని ప్రకటించారు. ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం నేషనల్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. చట్టసభల్లో రిజర్వేషన్లతో పాటు విద్య, వైద్యం, ఉద్యోగ, ఆర్థిక, పారిశ్రామిక, వాణిజ్య రంగాల్లోనూ బీసీలకు తగిన వాటా దక్కాలని అన్నారు. తమ పోరాటాన్ని మరింత విస్తృతపరిచేందుకు, ఢిల్లీ కేంద్రంగా పోరాడేందుకు సెంట్రల్ కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కమిటీ 250 మంది సభ్యులతో 11 మంది ముఖ్య నాయకులతో తమ కార్యకలాపాలను కొనసాగిస్తుందని వెల్లడించారు. ఢిల్లీ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వంపై అన్ని విధాలుగా ఒత్తిడి పెంచడం, అన్ని రాష్ట్రాల్లో వివిధ బీసీ సంఘాలను సమన్వయ పరుచుకుని విస్తృత స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం, ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టి త్వరలోనే బీసీ బిల్లును సాధించే పోతున్నామని తెలిపారు. 11 మందితో కూడిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ సెంట్రల్ కమిటీకి దాసు సురేష్ నియామక పత్రాలు అందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement