Friday, May 17, 2024

Breaking: స‌న్‌రైజింగ్‌, అద‌ర‌గొట్టిన బౌల‌ర్లు.. 68 ప‌రుగుల‌కే బెంగ‌ళూరు ఆలౌట్‌!

ఏప్రిల్ 23​ అంటే రాయల్​ చాలెంజర్స్​ బెంగళూరుకు అచ్చి వచ్చినట్టు లేదు.. 2017లో కోల్​కతాతో జరిగిన మ్యాచ్​లో బెంగళూరు టీమ్​ 49 పరుగులకే ఆలౌట్​ అయ్యింది. ఈసారి కాస్త బెటర్​ అని చెప్పవచ్చు.. సన్​ రైజర్స్​తో జరిగిన మ్యాచ్​లో అతి తక్కువ స్కోరు 68 పరుగులకే కుప్పకూలింది.

ఇవ్వాల స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌, రాయ‌ల్ చాలెంజ‌ర్స్‌ బెంగ‌ళూరు టీమ్‌ల మ‌ధ్య జ‌రుగుతున్న 36వ మ్యాచ్‌లో హైద‌రాబాద్ టీమ్ అద‌ర‌గొడుతోంది. ఫ‌స్ట్ బ్యాటింగ్‌కు దిగిన బెంగ‌ళూరు టీమ్‌ను స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్లు దీటుగా ఎదుర్కొన్నారు. 68 ప‌రుగుల అతి స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ చేశారు. దీంతో బెంగ‌ళూరు టీమ్ ఈ సిరీస్‌లో రెండోసారి అతి స్వ‌ల్ప స్కోరుకే ఆలౌట్ అయిన రికార్డును నెల‌కొల్పింది. 16.1 ఓవ‌ర్ల‌కు బెంగ‌ళూరు టీమ్ కుప్ప‌కూలింది.

సన్‌రైజర్స్ బౌలర్లంతా క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు బ్యాటింగ్ కకావికలమైంది. ఓపెనర్లు ఫాప్ డుప్లెసిస్ (5), అనూజ్ రావత్ (0), కోహ్లీ (0) చేతులెత్తేశారు. ఈ మూడు కీల‌క‌ వికట్లను ఒకే ఓవర్లో జాన్సెన్ తీసుకున్నాడు. ఆ తర్వాత కాసేపు నిలబడిన మ్యాక్స్‌వెల్ (12)ను నటరాజన్ పెవెలియ‌న్ పంపించేశాడు. ఇక మళ్లీ 9వ ఓవర్లో బంతి అందుకున్న సుచిత్ కూడా సత్తా చాటాడు. రెండో బంతికే సూయష్ ప్రభుదేశాయి (15)ని పెవిలియన్ చేర్చాడు.

అదే ఓవర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్‌ (0)ను కూడా సుచిత్ అవుట్ చేశాడు. సుచిత్ వేసిన బంతిని డీకే ఆడలేకపోయాడు. బంతి కీపర్ చేతుల్లో పడింది. కీపర్ పూరన్, సుచిత్ ఇద్దరూ అప్పీల్ చేసినా అంపైర్ స్పందించలేదు. దీంతో ఇద్దరూ కలిసి కెప్టెన్‌ను ఒప్పించి రివ్యూ తీసుకున్నారు. బంతి డీకే గ్లవ్‌ను తాకినట్లు రీప్లేలో తేలడంతో అతను కూడా పెవిలియన్ చేరాడు. దీంతో ఆ జట్టు 47 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement