Tuesday, April 30, 2024

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కోవిడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కరోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఈ స‌మ‌యంలో పార్టీల‌కు అతీతంగా ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉండాలి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్య‌తిరేక పోరాటంలో తాము సైతం అని కాంగ్రెస్ పార్టీ అంటోంది. క‌రోనా బాధితుల‌కు అండ‌గా గాంధీ భవన్‌లో క‌రోనా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు కరోనా బాధితులు ఎవరైనా సహాయం కోసం 040-24601254 నంబరుకు కాల్ చేయ‌వ‌చ్చ‌ని కాంగ్రెస్ పార్టీ నేతలు వివ‌రించారు. కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్లాస్మా, ఆక్సిజన్, ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్, మెడిసన్ తదితర వివరాలను అందిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement