Friday, May 17, 2024

రేపటి నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే షాపులు

ఏపీలో కరోనా కేసులు భీకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో విజయవాడలోని ముఠా కార్మికులు, వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించాలని విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. కరోనా విజృంభణ భయంకరంగా ఉన్న ఈ నేపథ్యంలో షాపులని పూర్తిగా తెరిచి ఉంచడం మంచిది కాదని విజయవాడలోని వ్యాపారులు మధ్యాహ్నం 2 గంటల లోపల షాపులు మూసేయాలని కోరారు.

అటు ఏపీలో రోజురోజుకు నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంగళవారం నాడు ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 74,435 శాంపిళ్లను పరీక్షించగా 11,434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10,54,875 చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,47,629 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే గడచిన 24 గంటల్లో 7,055 మంది డిశ్చార్జ్ అవగా ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 99,446కి పెరిగింది. ఏపీలో గత 24 గంటల్లో 64 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7,800కి చేరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement