Saturday, June 3, 2023

దేశాన్నే ఒకేసారి అమ్మేస్తాడు ఏమో?

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్ర నిర్ణయంపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతురావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల ఆవేదన స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం వీహెచ్ అన్నారు. లక్షల మందికి జీవనోపాధి విశాఖ స్టీల్ ఫ్లాంట్ అని తెలిపారు. అబద్ధాలు చెప్పడంలో నరేంద్ర మోదీ నెంబర్ వన్ అని… ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేశారని మండిపడ్డారు. భారతదేశాన్నే ఒకేసారి అమ్మేస్తాడు ఏమో? అని వ్యాఖ్యానించారు. తెలుగువారికి అన్యాయం జరిగితే తెలుగు ప్రజలు కలిసి పోరాడుతారని స్పష్టం చేశారు. తాను స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి పూర్తిగా మద్ధతు ఇస్తున్నానని, ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని వీహెచ్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement