Saturday, April 20, 2024

అంపైర్స్ కాల్ వివాదం: ఐసీసీ నిర్ణయం

గత కొద్ది రోజులగా క్రికెట్ లో అంపైర్స్ కాల్ వివాదం తారా స్థాయికి చేరుతోంది. అంపైర్‌ నిర్ణయ సమీక్షా పద్ధతి తరచూ చర్చనీయాంశమవుతోంది. దాదాపుగా అన్ని జట్ల నుంచి అంపైర్స్ కాల్ నిబంధనతో అసంతృప్తి వ్యక్తం చేశాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ అంశంపై ఎప్పుడు సందర్భం వచ్చిన స్పందిస్తూనే ఉన్నారు. దీంతో ఐసీసీ ఈ నిబంధనపై ఓ సారి సమీక్షించింది. అయితే అంపైర్స్‌ కాల్‌ను మార్చాల్సిన అవసరం లేదని ఐసీసీ  సమావేశంలో  తేల్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్‌ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్‌ఎస్‌లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్‌ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్‌ కాల్‌ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే తెలిపారు. ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్‌ కాల్‌ తరచూ వివాదాస్పదమవుతోంది. అలాగే కోవిడ్‌ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. క్రికెట్‌ కమిటీ ప్రధానంగా అంపైర్స్‌ కాల్‌పై చర్చించి విశ్లేషించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement