Sunday, May 5, 2024

పెగాసస్‌పై దేశవ్యాప్త ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

ఇజ్రాయెల్‌కు చెందిన పెగాసస్ టెక్నాలజీ ద్వారా భారత్‌లోని పలువురు ప్రముఖులకు చెందిన ఫోన్‌లు హ్యాక్ అవుతున్నాయి. ప్ర‌తిప‌క్ష నేత‌లు, జ‌ర్న‌లిస్టులు, ఇత‌ర ప్ర‌ముఖుల ఫోన్‌ల హ్యాకింగ్ కోసం పెగాసెస్ అనే ఇజ్రాయిల్ టెక్నాల‌జీని వాడ‌రాన్న వార్త ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తోంది. ఇది కేంద్ర ప్ర‌భుత్వం క‌నుస‌న్న‌ల్లోనే జ‌రిగింద‌ని ప్ర‌తిప‌క్షాలు పార్ల‌మెంట్‌ను స్తంభింప చేస్తున్నాయి. ఫోన్ హ్యాక్ అయిన ప్రముఖుల జాబితాలో రాహుల్ గాంధీతో పాటు ఆయ‌న సిబ్బంది కూడా ఉన్నారని కాంగ్రెస్ మండిప‌డింది.

ఈ నేపథ్యంలో పెగాసస్‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు నిర్వ‌హించాల‌ని, రాజ్ భ‌వ‌న్‌ల వ‌ర‌కు ర్యాలీలు చేప‌ట్టాల‌ని ఏఐసీసీ పిలుపునిచ్చింది. బుధ‌వారం ప్ర‌తి రాష్ట్రంలో పెగాస‌స్ అంటే ఏంటీ? కేంద్రం ఎంత పెద్ద త‌ప్పు చేసిందో చెప్తూ ప్రెస్ మీట్లు, అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీ కేసీ వేణుగోపాల్ ప్ర‌క‌టించారు. ఈ మొత్తం అంశంపై సుప్రీం ప‌ర్య‌వేక్ష‌ణ‌లో న్యాయ విచార‌ణ జ‌ర‌గాల‌ని డిమాండ్ చేస్తోంది. పెగాస‌స్ స్పైవేర్ అనేది ప్ర‌భుత్వాల‌కు మాత్ర‌మే అమ్ముతార‌ని, భారత్‌లో ఈ టెక్నాలజీ వాడారంటే ప్ర‌భుత్వ జోక్యం ఉన్న‌ట్లేన‌ని కాంగ్రెస్ విమ‌ర్శిస్తోంది.

ఈ వార్త కూడా చదవండి: పార్లమెంట్‌లో పెగాసస్ ప్రకంపంనలు

Advertisement

తాజా వార్తలు

Advertisement