Monday, May 20, 2024

కొత్త సంస్క‌ర‌ణ‌లప్పుడు ఆందోళ‌న‌లు వ‌స్తాయి.. కానీ, దేశానికి మేలు : ప్ర‌ధాని మోదీ

కొన్ని నిర్ణయాలు, సంస్కరణలు మొదట్లో కొంత ఇబ్బందిగా ఉన్నా, తరువాత కాలంలో వాటి ప్రయోజనాలను దేశం గ్రహిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. సోమవారం నాడు ఆయన బెంగళూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 21వ శతాబ్ద పు ఇండియా సంపద, ఉద్యోగాల సృష్టికర్తలదని, వారిని ప్రభుత్వం 8 సంత్సరాలుగా ప్రోత్సహిస్తుందని చెప్పారు. అగ్నిపథ్‌ పథకంపై విపక్షాలు, మాజీ సైనికారులు, నిరుద్యోగుల నుంచి వస్తున్న తీవ్ర విమర్శన నేపథ్యంలోనే ప్రధాని సంస్కరణల ఫలాల గురించి ప్రస్తావించారు. ఒక దాన్ని కొనుగొనడం, ప్రారంభించడం అంత తేలికేమీకాదు.

ఎనిమిదేళ్లుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడం కూడా అంత తేలికకాదని ప్రధాని చెప్పారు. సంస్కరణలు తాత్కాలికంగా ఇబ్బందిగా అనిపించి.నా, దీర్ఘకాలంలో వాటి ఫలితాలు ప్రజలకు అనుభవంలోకి వస్తాయన్నారు. అనేక సంవత్సరాలుగా పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ రంగంలో సరళీకరణ వల్ల అనేక కొత్త లక్ష్యాలు , కొత్త పరిష్కారాలకు దారి చూపుతుందని చెప్పారు. ప్రభుత్వం సౌకర్యాలు, మౌలిక వసతులు కల్పిస్తే యువతరం ఎలాంటి వాటిని సాధించగలదో బెంగళూర్‌ యువతే నిదర్శనమన్నారు. ఇక్కడ ఎందరో వ్యాపార వేత్తలుగా మారరని, ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరిగాయన్నారు. ఇందుకు ప్రభుత్వ, ప్రయివేట్‌ భాగస్వామ్యం దోహదపడిందన్నారు. తాను ఒక్క నిముషం కూడా వృధా చేయనని, ప్రతి నిముషం పని చేస్తూనే ఉంటానని ప్రధాని చెప్పారు. బెంగళూర్‌ నగరంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement