Tuesday, May 7, 2024

సెంట్రల్‌ యూనివర్శిటీలకు కామన్‌ ఎంట్రెన్స్‌..

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : 2022-23 విద్యా సంవత్సరానికి కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరిధిలో అన్ని అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు కామన్‌ యూనివర్శిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(సీయూఈటీ) నిర్వహించాలని తాజాగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 45 వర్శిటీలు ఉండగా, మన రాష్ట్రంలో హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ, ఇఫ్లూ,
మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఉర్దూ యూనివర్శిటీలున్నాయి. కామన్‌ ఎంట్రెన్స్‌ ద్వారానే ఈ వర్శిటీల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు అడ్మిషన్లు నిర్వహించనున్నారు.

12వ తరగతి మార్కులకు ఎలాంటి వెయిటేజీ ఉండబోదు. కామన్‌ ఎంట్రెన్స్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించనుంది. ఎన్టీఏ ఇచ్చే ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. ఏప్రిల్‌ మొదటి వారం నుంచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించేసి జూలై మొదటి వారంలో పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. 13 భాషల్లో కామన్‌ ఎంట్రెన్స్‌ పరీక్షను నిర్వహిస్తారు. కామన్‌ ఎంట్రెన్స్‌ నిర్వహణపై సోమవారం యూజీసీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement