Friday, April 26, 2024

క‌లెక్ష‌న్స్ కురిపిస్తోన్న హిందీ దృశ్యం2.. వారంలోనే రూ.86కోట్లు

దృశ్యం2 హిందీలో తెర‌కెక్కి ఈ నెల 18న రిలీజ్ అయింది. ఒక వారం కూడా పూర్తి కాకుండానే ఈ చిత్రం పలు రికార్డులను బద్దలు కొడుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రూ.86 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ్ గ‌న్.. టబు, అక్షయ్ ఖన్నా, శ్రియా శరణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఇప్పటికే భూల్ భూలాయ 2, గంగూబాయి కతియావాడి, ది కశ్మీర్ ఫైల్స్ వంటి హిట్ బాలీవుడ్ చిత్రాల తొలి వారాంతపు కలెక్షన్లను అధిగమించింది.

ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచే అవకాశం కూడా ఉంది. ఈ చిత్రానికి తొలి రోజు రూ. 15.38 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత కూడా ప్రతి రోజూ రూ. 10–15 కోట్లకు పైనే వసూళ్లు వస్తున్నాయి. మంగళవారం దృశ్యం 2 మొత్తం 18.27 శాతం హిందీ ఆక్యుపెన్సీ సాధించింది. ఈ లెక్కన ఈ చిత్రం మొదటి వారంలోనే 100 కోట్ల క్లబ్‌ లో చేరేలా కనిపిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement