Thursday, May 2, 2024

TS: సోయిలేకుండా మాట్లాడుతున్న సీఎం, మంత్రులు… జగదీష్ రెడ్డి

ముఖ్యమంత్రి, మంత్రులు అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని, కోమటి రెడ్డి వెంకటిరెడ్డి ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జి.జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్షంలో ఉన్నట్టే మాట్లాడుతున్నారన్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారన్నారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోందన్నారు. తమ మీద కోపం ఉంటే తీర్చుకోండి.. రాష్ట్రాన్ని నష్టం పరిచే చర్యలు చేయకండన్నారు.

నిమిషానికే మాట మార్చే రకం కోమటి రెడ్డి అన్నారు. నవంబర్ నుంచి విద్యుత్ బిల్లులు కట్టొద్దని కోమటిరెడ్డి చెప్పిన దాన్నే కేటీఆర్ చెప్పారన్నారు. కేటీఆర్ నిజం చెబితే కోమటిరెడ్డి చిన్న పెద్దా లేకుండా మాట్లాడుతున్నారన్నారు. కోమటిరెడ్డిని కాంగ్రెస్ లో కోవర్టు అని ఆ పార్టీ నేతలే అంటారన్నారు. కాంగ్రెస్ లో ఉంటూ బీజేపీ అభ్యర్థి తన తమ్ముడికి ఓట్లేయమని చెప్పింది కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ ను 39 ముక్కలు చేస్తా అంటున్నారు… కోమటిరెడ్డి తాత తరం కూడా కాదు బీఆర్ఎస్ ను అంతం చేయడం అన్నారు. కోమటిరెడ్డి లాంటి వాళ్ళెందరో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ..సాధ్యం కాలేదన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గురువు వల్ల కూడా ఆ పని కాలేదన్నారు. అధికారిక రివ్యూకి వెళ్లి కోమటి రెడ్డి అనవసర విషయాలు మాట్లాడారన్నారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లో చెప్పులు పెట్టే పాత రోజులు మళ్ళీ వచ్చాయన్నారు. ముందు ఆ సమస్య పై దృష్టి పెట్టాలన్నారు. రైతు బంధు ఇంకా రాకపోవడంపై అన్న దాతల్లో ఆందోళన ఉందన్నారు. అప్రకటిత కరెంటు కోతలు పెరిగి పోయాయన్నారు.

- Advertisement -

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది.. కొట్లాడే దమ్ము కాంగ్రెస్ కు ఉందా.. మేమే కొట్లాడాము.. ఎవరి వల్ల కాలేదన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు బీఆర్ఎస్ ఉంటుందన్నారు. బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం కాదు.. మీ బాసో నువ్వో మరో ఏక్ నాథ్ షిండే అవుతావు కోమటి రెడ్డి వెంకట రెడ్డి అన్నారు. పాలన కాంగ్రెస్ కు ఇచ్చింది పార్టీలను చీల్చడానికి కాదు.. ప్రజలే కాంగ్రెస్ ను చీల్చి చెండాడుతారన్నారు. కేసీఆర్ వల్లే సాగర్ లో నీళ్ల సమస్య వచ్చింది అంటున్నాడు కొమటి రెడ్డి… పాలన చేత కాకుంటే తప్పుకోవాలన్నారు. కోమటి రెడ్డికి సిగ్గుండాలి.. తప్పుడు మాటలు మాట్లాడడానికి..వాళ్ళు ఎపుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదన్నారు. నిరసనలకు తాము తొందర పడటం లేదు.. ప్రజలే సమస్యలపై రోడ్ల పైకి వస్తారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో తామే మెజారిటీ సీట్లు గెలుస్తామని జగదీష్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement