Sunday, April 28, 2024

Rama Raghavam: ధ‌న్ రాజ్ ద‌ర్శ‌కుడిగా ‘రామం రాఘ‌వం’….

ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో, కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నమూవీ రామం రాఘ‌వం. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మాణంలో ప్రొడక్షన్ నెంబర్ 1గా తెరకెక్కుతున్న ద్విభాష చిత్రం ఫ‌స్ట్ లుక్ ను అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఇరవై రెండు మంది సినీ ప్రముఖుల చేతుల మీదుగా విడుదల చేశారు.

నటుడు ధనరాజ్ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సముద్రఖనితో పాటు అతడు కూడా నటిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో తండ్రి కొడుకులుగా సముద్రఖని, ధనరాజ్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement