Sunday, April 28, 2024

త్వరలోనే జిల్లాలకు కొత్త గులాబీ బాస్‌లు: సీఎం కేసీఆర్

తెలంగాణ భ‌వ‌న్‌లో జ‌రిగిన‌ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర క‌మిటీ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరై పలు అంతర్గత విషయాలను చర్చించారు. గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి శాఖ‌ల పునర్నిర్మాణం వ‌ర‌కు స‌మావేశంలో చ‌ర్చించారు. అదేవిధంగా దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, పార్టీ చేయాల్సిన కృషిపై సీఎం కేసీఆర్ నేత‌ల‌కు దిశానిర్దేశం చేశారు.

రానున్న 20 ఏళ్లు తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్రభుత్వ‌మే ఉంటుంద‌ని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. న‌వంబ‌ర్ తొలివారంలో పార్టీ ప్లీన‌రీ స‌మావేశం నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. ద‌ళిత బంధుపై ప్ర‌జ‌ల‌ను చైత‌న్యం చేయాల‌న్నారు. ప్ర‌తిప‌క్షాల త‌ప్పుడు విమ‌ర్శ‌ల్ని తిప్పికొట్టాల్సిందిగా పిలుపునిచ్చారు. ద‌ళిత‌బంధును ఉద్య‌మంలా చేయాల‌న్నారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో తెలంగాణ భ‌వ‌న్‌కు శంకుస్థాప‌న చేసుకోబోతున్న‌ట్లు తెలిపారు. ద‌శ‌ల‌వారీగా స‌మాజంలోని అన్ని వ‌ర్గాల‌కు న్యాయం చేస్తామ‌న్నారు. త్వ‌ర‌లోనే కొత్త జిల్లా అధ్య‌క్షుల‌ను నియ‌మిస్తామ‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ వార్త కూడా చదవండి: గజ్వేల్‌లో అడుగుపెట్టి తీరుతా.. లేకపోతే గుండు కొట్టించుకుంటా: రేవంత్‌రెడ్డి

Advertisement

తాజా వార్తలు

Advertisement