Sunday, April 28, 2024

గల్లీ రౌడీ బ్యాక్ స్టెప్

సందీప్ కిషన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం గల్లీ రౌడీ. జీ.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కోన వెంకట్, ఎంవీవీ సత్యనారాయణ నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కావాల్సింది. ఆ విషయాన్ని అధికారికంగా కూడా నిర్మాతలు ప్రకటించారు. కాగా ఇప్పుడు ఆ తేదీన చాలా సినిమాలు విడుదల కానుండటంతో తాము కాస్తంత వెనక్కి వెళుతున్నట్టు తెలిపారు.

నిజానికి సెప్టెంబర్ 3న గల్లీ రౌడీ తో పాటు అవసరాల శ్రీనివాస్ నూటొక్క జిల్లాల అందగాడు, డియర్ మేఘ, కార్తీక్స్ ది కిల్లర్, గోపీచంద్ సీటీమార్ కూడా వస్తుంది. ఈ నేపధ్యంలోనే సినిమా విడుదలను పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. అయితే… సెప్టెంబర్ నెలలోనే తమ సినిమా విడుదల అవుతుందని, త్వరలోనే సరికొత్త తేదీని ప్రకటిస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement