Thursday, May 9, 2024

హస్తినలో బీఆర్ఎస్ ఆఫీసును ప్రారంభించిన సీఎం కేసీఆర్‌..

దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దేశంలో గుణాత్మక మార్పు కోసం పాటుపడిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించి, పార్టీ జాతీయ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు జాతీయ, రాష్ట్ర నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ ఆఫీసును ప్రారంభించిన అనంతరం కేసీఆర్ కార్యాలయం అంతటా కలియదిరిగారు. అనంతరం కేసీఆర్ కార్యాలయంలోని తన ఛాంబర్‌కు వెళ్లారు. ఆ తర్వాత ముహుర్తం మేరకు టైం చూసుకుని బీఆర్ఎస్ అధినేతగా తొలి సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కవిత, మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement