Monday, April 29, 2024

అన్నదాతలకు అండగా సీఎం కేసీఆర్.. పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా వ్యవసాయ పంట క్షేత్రాల్లో తిరిగిన దాఖలాలు లేవని,వ్యవసాయం గురించి తెలిసిన వ్యక్తిగా అన్నదాతకు అండగా ఉంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.పంట నష్టపోయిన సమయంలో ఇబ్బందిపడేది పెట్టుబడి పెట్టిన వారని.. వారే కౌలు రైతులని వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తామని అన్నారు.ప్రతిపక్షాలు చిల్లర మాటలు అపి రైతులకు సహాయం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకట నారాయణ గౌడ్, మున్సిపల్ ఛైర్పర్సన్ రజని కిషన్,లెక్కల విద్యాసాగర్ రెడ్డి,నల్ల మనోహర్ రెడ్డి,వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement