Tuesday, May 14, 2024

స్టార్ హీరో విజయ్ సేతుపతి.. ఫ్యాన్స్ కోసం క్యాలెండర్

ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫర్‌ ఎల్‌ రామచంద్రన్ స్టార్‌ హీరో విజ‌య్ సేతుప‌తి అభిమానుల కోసం అరుదైన కానుకను సిద్దం చేశారు. ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు విజయ్‌ సేతుపతి. ఈ స్టార్ హీరో తెలుగులో మైఖేల్ సినిమాలో నటిస్తున్నారు. మరోవైపు హిందీలో మేరీ క్రిస్మస్‌, ముంబైకర్‌, జవాన్‌, తమిళంలో విదుతలై , గాంధీ టాక్స్‌ సినిమాలు చేస్తున్నారు. త్వరలోనే 2022 సంవత్సరం ముగియనుంది. మరికొన్ని రోజుల్లో 2022కు గుడ్‌బై చెబుతూ 2023కి ఘనస్వాగతం పలుకనున్న నేపథ్యంలో విజ‌య్ సేతుప‌తి జర్నీ థీమ్‌తో నూతన సంవత్సర క్యాలెండర్ (Makkal Selvan Calender 2023 రూపొందించారు ఎల్‌ రామచంద్రన్ . ఈయన డిజైన్‌ చేసిన 2021, 2022 క్యాలెండర్స్‌ మంచి పాపులర్‌ అయ్యాయి. తాజాగా ‘ది ఆర్టిస్ట్‌’ పేరుతో ఈ క్యాలెండర్‌ అందుబాటులోకి రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement