Friday, May 3, 2024

వేసవి సెలవుల్లోనూ క్లాసులు.. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కార్పొరేట్‌ కాలేజీలు

అమరావతి,ఆంధ్రప్రభ: వేసవి సెలవుల్లో క్లాసులు నిర్వహించకూడదనేది ప్రభుత్వ ఆదేశాలు. జూన్‌ 1లోపు క్లాసులు ప్రారంభించకూడదని, అడ్మిషన్‌ ప్రక్రియ కూడా తాము చెప్పిన తర్వాతే ప్రారంభమవ్వాలని ఇంటర్‌ బోర్డు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది. కానీ కార్పొరేట్‌ కాలేజీలు ఇవేమీ పట్టడం లేదు. వేసవి సెలవుల్లోనూ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి నుండే అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించారు. వాస్తవానికి ఫిబ్రవరి నుండే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. జెఇఇ, నీట్‌ వంటి పరీక్షలకు పోటీపడేవారు కార్పొరేట్‌ కాలేజల్లో ముందే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ముందుగా పది వేలు ఫీజు కట్టి అడ్మిషన్‌ ఖరారు చేసుకుం టున్నారు. నిబంధనలు పేరుకే ఉన్నాయి కానీ కార్పొరేట్‌ కాలేజీలకు కళ్లె ం వేయలేకపోతున్నాయి.

సిలబస్‌ పూర్తి చేయాలనే నెపంతో…

జెఇఇ, నీట్‌కు ప్రిపేర్‌ అయ్యే విద్యార్ధులకు వీలైనంత త్వరగా సిలబస్‌ను పూర్తి చేయాలని కార్పొరేట్‌ కాలేజీలు లక్ష్యంగా పెట్టుకుంటాయి. అందుకోసం రోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్లాసులు, స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తాయి. ఒక్కొ క్లాసు మూడు గంటల పాటు ఉంటుంది. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఈవిధమైన బిజీ షెడ్యూల్‌తో విద్యార్ధులు ఎంతో ఒత్తిడికి గురౌతున్నారు. మొదటి ఏడాదిలో సిలబస్‌ పూర్తి చేసుకోవడానికి డిసెంబర్‌ వరుకు సమయం ఉంటుంది. అదే సెకండియర్‌లో అయితే అగస్టు చివరి నాటికే సిలబస్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టకుంటారు. అప్పటి నుండి జనవరి వరకు రివిజన్‌ చేయించితేనే జనవ రిలో జరిగే జెఇఇ మెయిన్స్‌ ఎగ్జామ్స్‌కు సిద్దమౌగలరనేది కార్పొరేట్‌ కాలేజీల ఆలోచన.

- Advertisement -

దీంతో వీలైనంత త్వరగా సిలబస్‌ను పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాలు ముగిసిన తర్వాత నాలుగు రోజులు సెలవులు ఇచ్చి వెంటనే క్లాసులు ప్రారంభించారు. మొదటి మొదటి వారం వరకు ఈ క్లాసులు జరగనున్నాయి. ఆ తర్వాత కూడా 15 నుండి 20 రోజులు వరకు సెలవులు ఇస్తున్నప్పటికీ అన్‌లైన్‌లో క్లాసులు ఉంటాయని చెబ్తున్నారు. దీంతో కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ చదివే విద్యార్ధులకు వేసవి సెలవులే లేని పరిస్థితిగా మారింది.

ఆట,పాటలకు దూరంగా…

విద్యార్ధులకు వేసవి సెలవలంటే ఆటపాటలకు సమయం. ఏడాది పాటు చదవుతో ఆలసిపోయిన విద్యార్ధులకు వేసవి సెలవులు ఒక ఉపశమనాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. పిల్లల సెలవులను బట్టి తల్లితండ్రులు వారిని పర్యాటక ప్రాంతాలకు కూడా తీసుకెళుతుంటారు. అంతేకాక బంధువులు, అమ్మమ్మలు, స్నేహితుల ఇళ్లకు కూడా వెళ్లి వస్తుంటారు. వీటితోపాటు కొంత మంది వేసవి సెలవులను ఉపయోగించుకోని ఏదోక కళ నో, క్రీడనో నేర్చుకుంటారు. కానీ కార్పొరేట్‌ కాలేజీల్లో ఇంటర్‌ చదువుతున్న విద్యార్ధులు వీటన్నింటికి దూరమౌతున్నారు. దీంతో వీరికి ఉపశమనం దొరకడం లేదు. ఇంటర్‌ ఫస్టియర్‌లో ఎదుర్కొన్న ఒత్తడి నుండి బయటపడకముందే రెండో ఏడాది ఒత్తిడి పెరుగుతోంది. దీన్ని నివారిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో జరగడం లేదు. దీంతో ఒత్తడి భరించలేని వి ద్యార్ధులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఇక నుండైనా ఈ స్థితిని మార్చాలని విద్యావేత్తలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement