Tuesday, May 14, 2024

సింగిల్ రాకెట్ తో 41 శాటిలైట్స్ ను నింగిలోకి పంపిన చైనా….

బీజింగ్‌: లాంగ్ మార్చ్ 2డీ రాకెట్‌ను చైనా ప్ర‌యోగించింది. ఆ రాకెట్ ద్వారా 41 ఉప‌గ్ర‌హాల ను పంపించింది. దీంతో డ్రాగ‌న్ దేశం కొత్త రికార్డును నెల‌కొల్పింది. ఒకే మిష‌న్‌లో ఆ శాటిలైట్ల‌ను పంప‌డం ఇదే తొలిసారి. షాంగ్జి ప్రావిన్సులో ఉన్న తైయువ‌న్ శాటిలైట్ లాంచ్ సెంట‌ర్ నుంచి రాకెట్‌ను ప్ర‌యోగించారు. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్‌లో ఇది 476వ ఫ్ల‌యిట్ మిష‌న్ కావ‌డం విశేషం.


ఇది ఇలా ఉంటే చైనా ప్ర‌యోగించిన శాటిలైట్లు . క‌మ‌ర్షియ‌ల్ రిమోట్ సెన్సింగ్ స‌ర్వీసుల‌ను క‌ల్పించ‌నున్నాయి. ఆ శాటిలైట్ల‌లో 36 జిలిన్‌-1 సిరీస్‌కు చెందిన‌వి. ఇప్ప‌టి వ‌ర‌కు చైనా మొత్తం 108 జిలిన్‌-1 శాటిలైట్ల‌ను ప్ర‌యోగించింది. తొలిసారి జిలిన్‌-1 శాటిలైట్‌ను 2015లో చైనా ప్ర‌యోగించింది. ఆ శాటిలైట్ బ‌రువు సుమారు 420 కేజీలు ఉంటుంది. ప్ర‌స్తుతం ఆ శాటిలైట్ల బ‌రువు కేవ‌లం 22 కిలోలు మాత్ర‌మే. స‌మాచార వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేయండం కోసం ఈ శాటిలైట్స్ ను నింగిలోకి పంపింది చైనా..

Advertisement

తాజా వార్తలు

Advertisement