Wednesday, May 1, 2024

సినీ ప‌రిశ్ర‌మలో ప‌క్ష‌పాత ధోర‌ణి ఉంది.. తాప్సీ

సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌క్ష‌పాత‌ధోర‌ణి ఉంద‌న్న సంగ‌తి తాను ఇండ‌స్ట్రీలోకి రాక‌ముందే తెలుస‌ని తెలిపింది హీరోయిన్ తాప్సీ.
బాలీ వుడ్ లో క్యాంపులు, ఫేవరెటిజం కొత్తేమీ కాదని, అవి ఎప్పటి నుంచో ఉన్నాయని హీరోయిన్ తాప్సీ అన్నారు. సినీ పరిశ్రమలో పక్షపాత ధోరణి ఉంటుందనే విషయం తనకు ఇండస్ట్రీకి రాకముందే తెలుసని చెప్పారు. నటీనటులు వారి స్నేహితులు కానీ లేదా వాళ్ల ఏజెన్సీలు కానీ… తమ సినిమాల్లోకి ఎవరు కావాలనుకుంటే వాళ్లనే తీసుకుంటారని తెలిపారు. వాళ్ల కెరీర్ కు సంబంధించిన విషయం కాబట్టి ఎవరినీ తప్పుపట్టలేమని అన్నారు. సినీ రంగంలో అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా ఇక్కడే ఉండాలనుకుంటే అది మీ సొంత నిర్ణయమని.. ఆ తర్వాత విమర్శించడం వల్ల లాభం లేదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement