Tuesday, May 14, 2024

హాంగ్‌జౌ ఆసియా క్రీడల బ్యాడ్మింటన్ జాబితాను ప్రకటించిన‌ చైనా

హాంగ్‌జౌ ఆసియా క్రీడల కోసం చైనా బ్యాడ్మింటన్ అసోసియేషన్ 20 మంది క్రీడాకారుల పేర్లను ప్రకటించింది. ప్రకటించిన జాబితాలో 10 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. పురుషుల, మహిళల టీమ్ ఈవెంట్‌లు, పురుషుల సింగిల్స్ – డబుల్స్, మహిళల సింగిల్స్ -డబుల్స్ & మిక్స్‌డ్ డబుల్స్‌లో ఈ పోటీలు జరగనున్నాయి..

జకర్తా లో జరిగిన గత ఎడిషన్‌లో చైనా మూడు బంగారు పతకాలు, ఒక రజతం, రెండు కాంస్యాలు సాధించింది. పురుషుల టీమ్ ఈవెంట్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడు స్వర్ణాలు వచ్చాయి. ఈసారి మొత్తం అన్నింటిలోనూ బంగారు పతకాలు సాధించాలనే పట్టుదలతో ఉంది చైనా..

ఎంపికైన క్రీడాకారుల జాబితా ..

పురుషుల విభాగం..

- Advertisement -

షి యుకి, లి షిఫెంగ్, లు గ్వాంగ్జు, వెంగ్ హాంగ్యాంగ్, లియాంగ్ వీకెంగ్, వాంగ్ చాంగ్, లియు యుచెన్, ఓ జువానీ, జెంగ్ సివే, ఫెంగ్ యాన్జే

మహిళల విభాగం

చెన్ యుఫీ, హే బింగ్జియావో, హాన్ యుయే, వాంగ్ జియీ, చెన్ క్వింగ్చెన్, జియా యిఫాన్, జెంగ్ యు, జాంగ్ షుక్సియన్, హువాంగ్ యాకియోంగ్, హువాంగ్ డాంగ్పింగ్

Advertisement

తాజా వార్తలు

Advertisement