Tuesday, May 14, 2024

Child Porn – రెండేళ్లుగా చైల్డ్ ఫోర్న్ వీడియోల‌ను అప్ లోడ్ చేస్తున్న హైద‌రాబాదీ …

హైదరాబాద్‌: హైదరాబాద్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలను వాట్సప్‌ ద్వారా వ్యాప్తిచేస్తున్న ఫోన్‌ నంబరును అమెరికన్‌ దర్యాప్తు సంస్థ హోమ్‌లాండ్‌ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్‌ (హెచ్‌ఎస్‌ఐ) గుర్తించింది. వాటిని ఇతర గ్రూపుల్లో పోస్టు చేస్తున్నాడు. వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తున్న నంబరును గుర్తించి భారత్‌లోని సంబంధిత దర్యాప్తు సంస్థలకు సమాచారం ఇవ్వాలని డీల్లీలోని అమెరికా రాయబార కార్యాలయానికి లేఖ రాసింది. రాయబార కార్యాలయం ఈ విషయాన్ని తెలంగాణ సీబీఐకి తెలియజేసింది. సీబీఐ తెలంగాణ సీఐడీకి సమాచారం చేరవేసింది

ఈ ఫోన్‌ నంబరు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ బృందంతో దర్యాప్తు చేయించిన సీఐడీ నిందితుడు రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉంటున్నట్లు నిర్ధారించుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లికి చెందిన యువకుడు (24) నగరంలోని రామంతాపూర్‌లో నివాసముంటూ ఎంసీఏ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రెండేళ్ల నుంచి ఐదు వాట్సప్‌ గ్రూపుల ద్వారా వస్తున్న చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి చూస్తున్నాడు.. దీంతో సైబర్‌క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత‌డిని అరెస్ట్ చేసేందుకు ప్ర‌త్యేక బృందాల‌ను రంగంలోకి దించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement