Sunday, February 25, 2024

24గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్న ఘనత కేసీఆర్ దే… మంద సంజీవ రెడ్డి

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ… కాంగ్రెస్‌ ప్రభుత్వ హయంలో రైతులకు సరైన కరెంట్‌ అందించలేక పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక చాలా మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు.

మళ్లీ రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రైతులకు మూడు గంటల కరెంట్‌ అందింస్తుందని, దీంతో గతంలో మాదిరిగా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్నారు. ఈ కార్యక్రమంలో BMC మేయర్ సామల బుచ్చి రెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, BMC కార్పొరేటర్లు, పార్టీ ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఇంచార్జ్ లు, BRS సీనియర్ నాయకులు, యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement