Sunday, May 19, 2024

హీరోగా బాలనటుడు సాత్విక్‌.. 11న విడుద‌ల కానున్న బ్యాచ్‌..

బాహుబలి, రేసుగుర్రం, దువ్వాడ జగన్నాథం, మళ్లీరావా వంటి సినిమాల్లో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్‌ వర్మ హీరోగా న‌టిస్తున్నాడు. బ్యాచ్‌ సినిమాలో కథా నాయకుడిగా లీడ్ రోల్ చేస్తున్నాడు. సాత్విక్‌ వర్మ, నేహా పటాన్‌ జంటగా నటిస్తున్న ఈ మూవీకి రఘుకుంచే సంగీతం అందించారు. కాగా, ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానున్న‌ట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇది రెండు భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివ మాట్లాడు తూ యూత్‌ ని టార్గెట్‌ చేసి తీసిన సినిమా ఇది.. బెట్టింగ్‌, మేల్‌ ప్రాస్ట్యూషన్‌ నేపథ్యంతో సాగుతుంది. మా బ్యాచ్‌ చిత్రం గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.. అన్నారు.

చిత్ర నిర్మాత రమేశ్ మాట్లాడుతూ సీనియర్‌ ఆర్టిస్టులు అందరూ మాకు ఫుల్‌ సపోర్ట్‌ చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 11 బ్యాచ్‌ సినిమాని రిలీజ్ చేస్తున్నాం” అన్నారు.. ఈ చిత్రంలో బాహుబలి ప్రభాకర్‌, వినోద్‌ కుమార్‌, చిన్నా, మిర్చి మాధవి, సంధ్యాజనక్‌ ,మేకా రామకృష్ణ, డి.ఎస్‌ రావు, చాందిని బతీజ్‌, వినోద్‌ నాయక్‌ తదితరులు నటిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement