Sunday, April 28, 2024

‘ఛట్’ పూజ..శుభాకాంక్షలు తెలియజేసిన ‘ఎమ్మెల్యే’ జిఎంఆర్..

పటాన్ చెరు, ప్రభ న్యూస్ : బీహార్, ఉత్తరప్రదేశ్ ప్రజలు పవిత్రంగా నిర్వహించుకునే ఛట్ పూజ పర్వదినాన్ని పురస్కరించుకొని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే జిఎంఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఛట్ పూజ సందర్భంగా చెరుకు గడలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ ఇండియాగా పేరొందిన పటాన్ చెరు నియోజకవర్గం లోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement