Monday, April 29, 2024

ద‌స‌రా నుండి చెమ్కీలా అంగీలేసి.. ఫుల్ సాంగ్ రిలీజ్

శ్రీకాంత్ ఓదెల డైరెక్ష‌న్ లో రూపొందుతున్న చిత్రం ద‌స‌రా. ఈ మూవీలో హీరోగా నాని..హీరోయిన్ గా కీర్తి సురేశ్ న‌టించారు.ఈ సినిమా నుంచి ‘చెమ్కీలా అంగీలేసి’ అనే ఫుల్ సాంగును రిలీజ్ చేశారు. సంతోష్ నారాయణ్ స్వరపరిచిన ఈ పాట జానపద బాణీలో నడుస్తుంది. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, ధీ – రామ్ మిర్యాల ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీని అందించాడు. గ్రామీణ నేపథ్యంలో నడిచే ఈ కథను మాస్ ఆడియన్స్ కి దగ్గరగా మలిచారు. కీర్తి సురేశ్ లుక్ కూడా కొత్తగానే ఉండనుంది. సముద్రఖని .. దీక్షిత్ శెట్టి .. సాయికుమార్ ముఖ్యమైన పాత్రలలో కనిపించునున్నారు. వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ కొన‌సాగుతుంద‌ట‌.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement