Wednesday, May 15, 2024

Breaking: తెలుగు రాష్ట్రాల కోసం … త్రిసభ్య కమిటీని నియమించిన కేంద్ర హోంశాఖ

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలను తొలిగించేందుకు త్రిసభ్య కమిటీని కేంద్ర హోంశాఖ నియమించింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలను తొలగించే దిశగా ప్రయత్నాలను మొదలు పెట్టింది. ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ కమిటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఇద్దరు సభ్యులుగా ఉంటారు. ఈ నెల 17వ తేదీన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగనుంది. ఈ త్రిసభ్య కమిటీ ప్రతి నెల సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement