Saturday, May 11, 2024

మూడు రోజుల్లోనే విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి..

విదేశాల నుంచి క‌రోనా వ్యాక్సిన్ల వినియోగానికి దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే డ్రగ్ కంట్రలర్ జనరల్ ఆప్ ఇండియా అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. ద‌ర‌ఖాస్తు నుంచి మొద‌లుపెడితే విదేశాల్లో త‌యారీ కేంద్రం రిజిస్ట్రేష‌న్, కొవిడ్‌-10 వ్యాక్సిన్ కోసం ఇచ్చే స‌ర్టిఫికెట్‌, దిగుమ‌తి లైసెన్స్ అన్నీ క‌లిపి మూడు ప‌ని దినాల్లోనే పూర్త‌వుతుంద‌ని ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది. ఓ విదేశీ త‌యారీదారు త‌న ఇండియాలోని అనుబంధ సంస్థ లేదా ఏజెంట్ ద్వారా సెంట్ర‌ల్ డ్ర‌గ్స్ స్టాండ‌ర్డ్ కంట్రోల్ ఆర్గ‌నైజేష‌న్కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అమెరికా, బ్రిట‌న్‌, యురోపియ‌న్ యూనియ‌న్‌, జ‌పాన్‌లాంటి దేశాల్లో ఇప్ప‌టికే అత్య‌వ‌స‌ర వినియోగానికి అనుమ‌తి పొందిన వ్యాక్సిన్ల ద‌ర‌ఖాస్తుల‌కు సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అనుమ‌తించాల‌ని ప్ర‌భుత్వం ఇప్పటికే నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement