Friday, April 26, 2024

Business: నీట్‌ యూజీ పరీక్ష రాసే వారికి ఓయో ఆఫర్‌, హోట‌ళ్ల‌లో బ‌స చేస్తే 60శాతం ఆఫ‌ర్‌!

హోటల్‌ బిజినెస్‌లో ఉన్న ఓయో నీట్ యూజీ మెడికల్‌ పరీక్షకు హాజరవుతున్న వారికి ఆఫర్‌ ప్రకటించింది. ముఖ్యంగా విద్యార్ధినులకు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. పరీక్షకు హాజరవుతున్న విద్యార్ధినులు తమ హోటళ్లలో బస చేస్తే 60 శాతం డిస్కౌంట్‌ ఇస్తామని ప్రకటించింది. ఈ ఆఫర్‌ ఈ నెల 16,17 తేదీలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ నెల 17న నీట్‌ పరీక్ష దేశవ్యాప్తంగా 497 ప్రాంతాల్లో జరగనుంది. నీట్‌కు 18 లక్షల మందికిపైగా హాజరవుతున్నారు.

ఈ డిస్కౌంట్‌ను పొందాలంటే ముందుగా ఓయో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీ పరీక్షా కేంద్రానికి దగ్గరలో ఉన్న హోటల్‌ను ఎంపిక చేసుకునేందుకు నియర్‌బై అన్న ఐకాన్‌పై క్లిక్‌ చేసి తెలుసుకోవచ్చు. రూమ్‌ను బుక్‌ చేసుకునేందుకు కూపన్‌ కోడ్‌ నీట్‌జేఎఫ్‌ను సెలక్ట్‌ చేసుకుని బుక్‌ చేసుకుని ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు పూర్తి చేయాలి. విద్యార్ధినులు బుక్‌ చేసుకునే హోటళ్లలో వైఫైతో పాటు, ఏసీ కూడా ఉంటుందని ఓయో తెలిపింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement