Thursday, April 25, 2024

Business: సమానమైన యూరో- డాలర్‌, 20 ఏళ్లలో ఇదే తొలిసారి

అంతర్జాతీయ మార్కెట్‌లో యూరోపియన్‌ దేశాల కరెన్సీ యూరో, అమెరికా డాలర్‌ సమానమయ్యాయి. 20 సంవత్సరాల తరువాత ఈ రెండు కరెన్సీలు ఒకే విలువగా నిలిచాయి. ప్రధానంగా స్విఫ్ట్‌ సమస్యలు, దారుణమైన సంక్షోభం కారణంగానే యూరో పతనమైనట్లు మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఆంక్షలు విధించడంతో రష్యా నుంచి యూరోపియన్‌ దేశాలకు చమురు, గ్యాస్‌ ఎగుమతులు తగ్గిపోయాయి. ఫలితంగా యూరో విలువ 12 శాతం తగ్గిపోయింది. రష్యా చాలా దేశాలకు గ్యాస్‌ సరఫరాలో భారీ కోత విధించింది.

ఆయా దేశాల్లో ధరలు భారీగా పెరిగిపోయాయి. రష్యాపై ఆంక్షల్లో భాగంగా యూరోల్లో చెల్లింపులను నిలిపివేయాలని అమెరికా డిమాండ్‌ చేసింది. దానికి అనుగుణంగా స్విఫ్ట్‌ను నిషేధించారు. ఫలితంగా డాలర్లలో చెల్లింపులు చేయాల్సి వస్తోంది. యూరో పతనం ఇంతటితో ఆగదని ఇది మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికాలోనూ ద్రవ్యోల్బణం అధికంగా ఉంది. బుధవారం నాడు ఒక యూరోకు డాలర్‌ మారకపు విలువ1.01 ఉంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1.16 డాలర్లుగా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement