Monday, April 29, 2024

Delhi | హైదరాబాద్-విజయవాడ రూట్​లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే.. నిర్మించాలని కోరిన కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారికి సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించాలని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఆయన రూల్ 377 ప్రకారం లోక్‌సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి (ఎన్‌హెచ్ 65)ను 6 వరుసలుగా విస్తరించాలని ఆయన చాలాకాలంగా కేంద్రాన్ని కోరుతున్నారు.

న్యాయపరమైన చిక్కులతో విస్తరణ పనులకు ఆటంకం ఏర్పడి కేవలం ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు మాత్రమే ఆరు వరుసల పనులు పూర్తయ్యాయి. మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మించాలని ఆయన మరోసారి పార్లమెంట్‌లో ప్రస్తావించారు. హైదరాబాద్ – విజయవాడ మార్గంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement