Friday, May 3, 2024

తెలంగాణ ఎంసెట్ ఆధారంగానే… బీఎస్సీ హానర్స్ ప్రవేశాలు

ఎంసెట్ ద్వారానే బీఎస్సీ (హానర్స్) కమ్యూనిటీ సైన్స్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ డాక్టర్ ఎస్.సుధీర్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు బాలికలకు మాత్రమే ప్రవేశ అర్హత ఉండగా, ఇప్పుడు బాలురకు కూడా అవకాశం కల్పించామని తెలిపారు. బీఎస్సీ హనర్స్ కమ్యూనిటీ సైన్స్ లో చేరాలనుకునే విద్యార్థులు తప్పకుండా ఎసెంట్ -2021లో ర్యాంకు పొందాల్సిందేనని అన్నారు. ఎంసెట్ లో పొందిన ర్యాంకు మెరిట్ ఆధారంగా ఎంపీసీ, బైపీసీ స్ట్రీమ్ విద్యార్డులకు 50:50 ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తామని అన్నారు.

నాలుగేళ్ల కాల వ్యవధిగల ఈ కోర్సును ఐదవ డీన్ల కమిటీ సూచన మేరకు బీఎస్సీ (హనర్స్) కమ్యూనిటీ సైన్స్ గా మార్చారని తెలిపారు. గతంలో ఈ కోర్సు బీఎస్సీ హోం సైన్స్ గా పిలిచేవారని వివరించారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మిడియటల్, తత్స
మాన కోర్సులోని ఆప్షనల్ సబ్జెక్టులలో పొందిన మార్కుల మెరిట్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్టు తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ ఎంసెట్ లో ర్యాంకు పొందిన అభ్యర్థులకు మాత్రమే అర్హత కల్పిస్తూ విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ నిర్ణయించిందని సుధీర్ కుమార్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement