Thursday, May 2, 2024

Breaking : టాలీవుడ్ లో ఏకమయిన చిన్న నిర్మాతలు..నిర్మాత మండలి ఎన్నికలు జరిపేందుకు డిమాండ్

టాలీవుడ్ లో ఏకమయ్యారు చిన్న నిర్మాతలు.ఈ మేరకు నిర్మాత మండలి ఎన్నికల కోసం వారు డిమాండ్ చేశారు.చిన్న నిర్మాతలు గళమెత్తడంతో దిగివచ్చారు నిర్మాత సి.కల్యాణ్..కాగా రెండేళ్ల కాల పరిమితితో జరుగుతూ వస్తున్నాయి నిర్మాత మండలి ఎన్నికలు.2019లో జరిగిన ఎన్నికల్లో అధ్య‌క్షుడిగా సి.కల్యాణ్ నియమితులయ్యారు.కాగా గత రెండేళ్లుగా తదుపరి ఎన్నికలపై ఊసేలేదని మండిపడుతున్నారు చిన్న నిర్మాతలు.ఈ ఎన్నికల కోసం సి.కల్యాణ్ ఆఫీస్ కి వెళ్లి పట్టుబట్టారు చిన్న నిర్మాతలు.దాంతో ఫిబ్రవరి 26న ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉంది. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు నిర్మాత సి.కల్యాణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement