Sunday, May 5, 2024

ముఖ్య‌మంత్రి బొమ్మై విజ‌యం … మాజీ సిఎం షెట్ట‌ర్ ఓట‌మి

కర్ణాటక ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి బస్వరాజ్ బొమ్మై గెలుపొందారు. షిగావ్ నుంచి పోటీ చేసిన ఆయ‌న త‌న స‌మీప కాంగ్రెస్ అభ్య‌ర్ధిపై నాలుగు వేల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు..
ఇక టికెట్ నిరాక‌రించ‌డంతో బీజేపీకి రాజీనామా చేసి హుబ్లీ- ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలో దిగిన కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ముఖ్య‌మంత్రి జగదీశ్‌ షెట్టర్ ఓటమి పాలయ్యారు. ఆయ‌న‌ను బిజెపి అభ్య‌ర్ధి రెండు వేల ఓట్ల తేడాతో చిత్తు చేశారు..

మంత్రి, బీజేపీ నేత శ్రీరాములు ఓటమి..
బళ్లారి (ఎస్‌టీ) స్థానం నుంచి పోటీచేసిన బీజేపీ అభ్యర్థి, మంత్రి శ్రీరాములు ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ అభ్యర్థి నాగేంద్ర ఆయనపై విజయం సాధించారు. శ్రీరాములు గతంలో.. ఐదు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. బిజెపికి బ‌ల‌మైన స్థానంగా ఉన్న ఈ స్థానంలో గాలి జనార్ధ‌న్ రెడ్డి ఇక్క‌డ త‌న అభ్య‌ర్ధిని నిల‌ప‌డంతో బిజెపి ఓటు బ్యాంక్ చీలిపోయింది.. దీంతో శ్రీరాములు ఓట‌మి త‌ప్ప‌లేదు..

Advertisement

తాజా వార్తలు

Advertisement