Tuesday, April 30, 2024

Bomb threats: ఇరాన్ లో బాంబు దాడి.. అగ్రరాజ్యంలో వణకు… క్యాపిట‌ల్‌ భ‌వ‌నాలకు టైట్ సెక్యూరిటీ..

అగ్ర‌రాజ్యంలో ప‌లు రాష్ట్రాల‌కు బాంబు బెదిరింపులు వ‌చ్చాయి. జార్జియా, కనెక్టికట్‌, కెంటుకీ, మిషిగాన్‌, మిన్నెసోటా, మిసిసిపీ, మోంటానా, మైన్‌, హవాయి రాష్ట్రాల క్యాపిటల్‌ భవనాలకు ఈ బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు వాటిని ఖాళీ చేయించారు.

ఇరాన్‌లో భీకర పేలుళ్ల వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడంతో అధికారులు ముందస్తుగా ఈ చర్యలు చేపట్టారు. గుర్తు తెలియని ఈ-మెయిల్‌ ఐడీ నుంచి ఒకేసారి అన్ని ఆఫీసులకు ఈ సందేశాలు చేరినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. తక్షణమే ఆ భవనాలను ఖాళీ చేయించి డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీలు చేపట్టామని.. అయితే, ఎక్కడా పేలుడు పదార్థాలు లభించలేదని తెలిపారు. అవి నకిలీ బెదిరింపులని ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ధ్రువీకరించింది. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement