Sunday, April 28, 2024

KNL: కర్నూలు జిల్లాలో 13మంది సీఐల బదిలీ.. వీఆర్ లోకి ఎనిమిది మంది

కర్నూలు జిల్లా పోలీస్ శాఖలో బదిలీల పర్వం మొదలైంది. రాబోయే ఎన్నికల నేపథ్యంలో పోలీస్ శాఖలో ఒకేచోట పనిచేస్తున్న సిఐలను, ఎస్ఐలను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి విధితమే. ఈ మేరకు ఇటీవల పోలీస్ శాఖలో లాంగ్ స్టాండింగ్ మూడేళ్లు, ఐదేళ్లు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐలు, ఎస్ఐలపై జిల్లా పోలీసు యంత్రాంగం కాచి, వడబోసింది. ఈ క్రమంలో మొదట కర్నూలు జిల్లాలో 13 మంది సిఐలకు స్థానచలనం కల్పించగా, వీరిలో ఎనిమిది మందికి ఇక్కడ పోస్టింగ్ ఇవ్వకుండా వీఆర్ లో ఉంచడం విశేషం.

బదిలీ అయిన సీఐల వివరాలు ఇలా ఉన్నాయి:
కర్నూల్ లో వీఆర్ లో ఉన్న తేజ మూర్తి, గోపి ఆదోని వన్ టౌన్, టూ టౌన్ కి బదిలీ అయ్యారు. ఆదోని టూ టౌన్ లో ఉన్న శ్రీనివాస్ నాయక్ ని వీఆర్ కు పంపారు. కర్నూలు 3 టౌన్ లో పనిచేస్తున్న మంజునాథ్ ను ఆదోని ట్రాఫిక్ కు బదిలీ చేశారు. ఆదోని ట్రాఫిక్ లో ఉన్న పార్థసారథిని వీఆర్ కు పంపారు. అలాగే కర్నూలు సీసీఎస్ లో ఉన్న ఉపేంద్ర బాబు, ఆదిలక్ష్మి, నాగ శేఖర్ లను కూడా వీఆర్ కు పంపడం విశేషం. ఇక దిశలో ఉన్న లక్ష్మయ్య, కాల్వ వెంకటరమణ, కర్నూలు తాలకుల పని చేస్తున్న సీఐ శ్రీరాములు, మంత్రాలయంలో పనిచేస్తున్న కే.శ్రీనివాసులు లను వీఆర్ లో ఉంచారు. ఇక కర్నూలు వీఆర్ లో ఉన్న ఎరిసావులకి మంత్రాలయంలో పోస్టింగ్ ఇచ్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ ఆదేశాల మేరకు ఎస్పీ కృష్ణ కాంత్ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement