Saturday, May 18, 2024

విజ‌యం సాధించిన ష‌ణ్ముఖ్..మొద‌టిసారిగా కెప్టెన్

ఎట్ట‌కేల‌కు కెప్టెన్ గా మారాడు ష‌ణ్ముఖ్..బిగ్ బాస్5 హౌస్ లోకి అడుగుపెట్టిన నాటి నుంచి కాస్త నెమ్మ‌దిగా ఉన్న ష‌ణ్ముఖ్ త‌న జోరుని పెంచాడు. గేమ్స్ ..టాస్క్ ల‌లో త‌న‌దైన స్పీడ్ ని కొన‌సాగిస్తున్నాడు. క‌రెక్ట్ టైంలో ష‌ణ్ముఖ్ మంచి నిర్ణ‌యాన్ని తీసుకున్నాడ‌ని ప్రేక్ష‌కులు కొనియాడుతున్నాడు. ఫిజికల్ టాస్కుల్లో ఢీ అంటే ఢీ అంటూ కంటెస్టెంట్స్ కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు . బాడీలో తనకంటే స్ట్రాంగ్ అయిన విశ్వకి ధీటైన పోటీ ఇచ్చాడు. ఇక సన్నీకి అయితే దిమ్మతిరిగే షాక్ ఇస్తూ పైచేయి కనపరిచాడు.

అయితే ఇప్పటికి షణ్ముఖ్ ఆటపై విమర్శలు వస్తూనే ఉన్నాయి .. తాజాగా రవి కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు .. రవి చెప్పింది నిజమే. షణ్ముఖ్.. జస్వంత్ ఉంటే మోజ్ రూంలో ఉంటాడు.. లేదంటే బెడ్‌పై సిరితో దుప్పటి కప్పుకుని పడుకుంటాడు.. ఆ పక్కనే జెస్సీ కూడా యాడ్ అవుతాడు. అందరూ ఎవరి ఆట వాళ్లు ఆడుతున్నా.. వీళ్ల లోకం మాత్రం ఆ మోజ్ రూం తప్ప వేరే లోకం తెలియదనే కామెంట్స్ ని చేశాడు ర‌వి. నన్ను వెధవని చేసి సిరి లాభం పొందుతుందని షణ్ముఖ్ పదే పదే అంటుంటాడు తప్పి.. ఆమె చేతిలో ఎంతో ఇష్టంగా వెధవ అవుతూనే ఉంటాడు. బయట అతని ఫ్యాన్స్ హీరోలా చూస్తుంటే సిరి చేతిలో జీరో అవుతున్నాడు.

కాగా తాజా ప్రోమోలో షణ్ముఖ్‌ ఆట తీరు ఎలా ఉందో రవి కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. అయితే తాజాగా షన్ను సత్తా చాటాడు .. ఈ వారం కెప్టెన్ గా ఎన్నికయ్యాడు . కెప్టెన్సీ రేసులో మొదటి సారి అడుగుపెట్టి విజయం సాధించాడు .. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ సన్నీ , మానస్ , శ్రీరాం ఒకర్ని ఒకరు టార్గెట్ చేసుకోవడం కూడా షన్ను కి కలసి వచ్చింది .. కెప్టెన్సీ రేసులో సిరి , ఆని మాస్టర్ , షన్ను మిగలగా . షన్ను విన్నర్ గా నిలిచి కెప్టెన్ గా ఎన్నికవ్వ‌డం విశేషం..దాంతో ష‌ణ్ముఖ్ కూడా ఆట‌ల్లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌ని క‌న‌బ‌రుస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement