Wednesday, May 15, 2024

పోలియో రహిత సమాజం నిర్మించాలి – ఎమ్మెల్యే గండ్ర

ప్రభ న్యూస్ ప్రతినిధి,భూపాలపల్లి : పోలియో రహిత సమాజం నిర్మించాలని భూపాలపల్లి శాసన సభ్యులు వెంకటరమణ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, ప్రతి గ్రామంలో ఉదయం 8:00 am నుండి ..సాయంత్రం 5:00 pm వరకు నిర్వహిస్తున్న పల్స్ పోలియో చుక్కల శిభిరాల్లో భాగంగా భూపాలపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం , మొగుళ్ళపల్లి మండలం,రంగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో చుక్కలు శిభిరాన్ని భూపాలపల్లి శాసన సభ సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల పిల్లలందరికి పోలియో చుక్కలు వేయాలనే ఉదేశ్యంతో ప్రతి గ్రామంలో పోలియో చుక్కల శిభిరాన్ని ఏర్పాటు చేసి ఉదయం 8 గంటల నుండి ఈ కార్యక్రమంను ప్రారంభించామ‌న్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ వెంకట రాణీ సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు ,టౌన్ పార్టీ ప్రెసిడెంట్ కటకం జనార్ధన్ , ప్రధాన కార్యదర్శి, జిల్లా మైనారిటీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు,టౌన్ ముఖ్య నాయకులు మొగుళ్ళపల్లి ఎంపీపీ, జడ్పీటీసీ,మండల పార్టీ ప్రెసిడెంట్,వైస్ ఎంపీపీ,పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్లు, గ్రామ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు,గ్రామ శాఖ అధ్యక్షులు, వార్డు సభ్యులు, నాయకు లు,కార్యకర్తలు గండ్ర యువసేన నాయకులు , వైద్య సిబ్బంది, ఆశాలు, అంగన్వాడీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement